News

సనాతన ధర్మ పరిరక్షణకు చట్టం తేవాలి

24views

సనాతన ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించే వ్యక్తిగా.. వారాహి డిక్లరేషన్‌ను వేంకటేశ్వరుని పాదాల సాక్షిగా ప్రకటిస్తున్నా’ అని తిరుపతిలో జరిగిన వారాహి బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

ఏ మతానికి, ఏ ధర్మానికి భంగం వాటిల్లినా.. ఒకేలా స్పందించేలా లౌకిక వాదాన్ని పాటించాలి.

సనాతన ధర్మ పరిరక్షణ, విశ్వాసాలకు భంగం కలిగించే చర్యలను అరికట్టడానికి దేశం మొత్తం అమలయ్యేలా బలమైన చట్టాన్ని తక్షణమే తేవాలి. దాన్ని అమలు చేసేలా జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు కావాలి. దానికి ఏటా నిధులు కేటాయించాలి.

ఆలయాల్లో నిత్య నైవేద్యాలు, ప్రసాదాల్లో వినియోగించే వస్తువుల స్వచ్ఛతను ధ్రువీకరించే విధానం తీసుకురావాలి.

ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగానే కాకుండా విద్య, కళ, ఆర్థిక, పర్యావరణ పరిరక్షణ, సంక్షేమ కేంద్రాలుగా రూపుదిద్దుకోవాలి. ఆ దిశగా ప్రణాళిక సిద్ధం చేయాలి.