News

దుర్గా మండపంలో గోవు తల: ఛాందసుల పనేనన్న హిందువులు

36views

హిందువులకు దేవీ నవరాత్రులు అత్యంత పవిత్రం. అత్యంత నిష్ఠతో మాంసం, మద్యానికి దూరంగా వుండి అమ్మవారిని కొలుస్తారు. కానీ… బెంగాల్ లో ఘోరం జరిగింది. బెహార్ జిల్లాలోని సితాల్ కుచీలో దుర్గాపూజ మండపం దగ్గర జంతు తలను నిర్వాహకులు గుర్తించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై స్థానిక హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అత్యంత హేయమైన, నీచమైన చర్య అని మండిపడుతున్నారు. ఇది పక్కా ఛాందసుల పనేనని, కొందరు దుర్మార్గులు ఇలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దుర్గాపూజ మండపాన్ని అపవిత్రం చేశారని, దురుద్దేశపూర్వకంగా ఇలా చేశారన్నారు. బంగ్లాదేశ్ లో దుర్గాపూజ మండపాలపై ఆంక్షలు విధించారని, అలాగే దాని ప్రేరణగా ఇక్కడ కూడా కొందరు ఇలా చేస్తున్నారని హిందుత్వ నేతలు అంటున్నారు. అక్రమ బంగ్లాదేశీయులే ఇలా చేస్తున్నారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మతపరమైన ఘర్షణలు జరగడానికి, హిందువుల పండుగ పూట ఇబ్బందులు సృష్టించడానికే ఇదంతా అని అన్నారు. దీనిపై వెంటనే పోలీసులు లోతైన దర్యాప్తు చేయాలని, బాధ్యులను గుర్తించాలని డిమాండ్ చేశారు.