News

సింహాసనం.. సిద్ధమయ్యిందిగా..

24views

ప్రతిష్టాత్మక మైసూరు దసరా ఉత్సవాలకు అంతా సిద్ధమయ్యింది. ఓవైపు విద్యుద్దీపాల అలంకరణ, మరోవైపు గజరాజుల విన్యాసాలతో రాచనగర వీధులు శోభాయామానంగా దర్శనమిస్తున్నాయి. ప్యాలెస్‌ సంప్రదాయంలో భాగంగా బంగారు వజ్రఖచిత సింహాసనం అమరిక జరిగింది. తెల్లవారుజామునుంచే ప్రత్యేక పూజలు కొనసాగాయి. లాకర్లలో భద్రపరిచిన విడిభాగాలను జిల్లా అధికారుల సమక్షంలో బయటకు తీసుకొచ్చారు. 7.30 గంటలకు నవగ్రహ, శాంతి హోమాలు జరిగాయి. 9.55 గంటలకు దర్బార్‌ హాల్‌లో సింహాసనాన్ని అమర్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో రాజమాత ప్రమోదాదేవి ఒడెయార్‌, ప్యాలెస్‌ పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.

3 నుంచి దసరా ఉత్సవాలు..
అక్టోబరు 3నుంచి శరన్నవ నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఉదయం పూజలతో శ్రీకారం చుడతారు. తెల్లవారుజామున 5.45 గంటలకు రత్నఖచిత సింహాసనానికి ముఖం అమర్చే ప్రక్రియ చేపడతారు. ప్యాలెస్‏లో యదువంశరాజు యదువీర కృష్ణదత్త చామరాజ ఒడయార్‌కు కంకణధారణ చేయనున్నారు. 10.30 గంటలకు పట్టపుటేనుగు, ప్యాలె స్‌ గుర్రాలు, ఆవులకు పూజలు చేస్తా రు. 12 గంటలకు సింహాసనంపై యువరాజు ఆశీనులు కావడం ద్వారా ప్రైవేట్‌ దర్బార్‌ ప్రారంభం కానుంది.

మధ్యాహ్నం 1 గంటకు కులదేవత చాముండేశ్వరిదేవి మూర్తిని ఊయల్లో ఉంచి ప్యాలెస్‌టో ఉత్సవాలు ప్రారంభిస్తారు. 4న పారంపార్య మోటర్‌బైక్‌ ర్యాలీ జరుగుతుంది. అక్టోబరు 9న బుధవారం ఉదయం 10 గంటలకు సరస్వతి పూజ చేస్తారు. 10న రాత్రి ప్రైవేట్‌ దర్బార్‌ ముగియనుంది. 11న దుర్గాష్టమి జరగనుంది. ప్రతిరోజూ ప్యాలెస్‌ లోపల రాజసంప్రదాయంగా పూజ లు, కార్యక్రమాలు కొనసాగి, ప్రభుత్వ కార్యక్రమాలు నిరంతరంగా ఉంటాయి.