News

యూపీలో హిందూ వ్యాపారులపై ముస్లింల దాడి

18views

యూపీలోని సరఫా బజార్ లో శుక్రవారం హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. ఓ దుకాణం విషయంలో జైనులపై ముస్లిం వ్యాపారులు దాడి చేశారు .దీంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. జైనులపై భౌతిక దాడులకు దిగడంతో పాటు ముస్లింలు వారిని తీవ్రంగా దుర్భాషలాడారు. ముస్లింల దాడిలో పలువురు జైనులు తీవ్రంగా గాయపడ్డారు. వివాదాస్పదంగా వున్న ఓ భూమిని తనిఖీ చేయడానికి కోర్టు కమిషన్ వచ్చిన సందర్భంగా ఈ ఘర్షణలు రేగాయి. ఈ వివాదం కోర్టులో రెండు సంవత్సరాలుగా నలుగుతూనే వుంది. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. గతంలోనూ ఇలాంటి దాడులే జరిగాయని పలువురు గుర్తు చేసుకుంటున్నారు.
కోర్టు కమిషన్ సభ్యులు స్థలాన్ని పరిశీలిస్తున్న సమయంలోనే ఈ దాడి జరిగిందంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. మహ్మద్ రషీద్ తో పాటు సోదరులు వాజిద్, ఆసిఫ్ తో కలిసి ఆయుష్ జైన్ తో పాటు పలువురు జైనులపై దాడులకు దిగారని, హింసను ప్రేరేపించారని స్థానికులు స్పష్టంగా చెబుతున్నారు. ఈ గొడవ జరుగుతున్న సమయంలో ముస్లింల చేతిలో మారణాయుధాలు కూడా వున్నాయని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.

నిజానికి ఏం జరిగిందంటే… కత్రా మోచియాన్ ప్రాంతంలో ఆయుష్ జైన్ తో పాటు పలువురు హిందువుల దుకాణాలు వున్నాయి. అయితే… మహ్మద్ రషీద్ తో పాటు మరికొంత మంది ముస్లింలు ఆయుష్ జైన్ దుకాణంలో కొంత భాగాన్ని, దాని వెనుక వున్న స్థలాన్ని చట్ట విరుద్ధంగా ఆక్రమించడానికి ప్రయత్నాలు చేశారు. దీంతో అక్కడ ఘర్షణలు జరుగుతున్నాయి. ఇలా రెండు సంవత్సరాలుగా జరుగుతోందని, ప్రతి సారి శాంతియుతంగా జరగడానికే ప్రయత్నాలు చేస్తున్నా… హింసను ప్రేరేపిస్తున్నారని ఆయుష్ జైన్ తెలిపారు.