News

స్వామి నారాయణ్ దేవాలయంపై దాడిని ఖండిస్తున్నాం : చక్రపాణి మహారాజ్

14views

కాలిఫోర్నియాలోని బీఏపీఎస్ స్వామి నారాయణ మందిర్ విధ్వంసాన్ని హిందూ మహాసభ అధ్యక్షుడు చక్రపాణి మహారాజ్ తీవ్రంగా ఖండించారు. పది రోజుల లోపే మళ్లీ దాడి జరిగిందని, ఇది మొత్తం హిందువులపై జరిగిన దాడి అని, వివిధ ప్రాంతాల్లోనూ హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలో హిందువులు హింసింపబడుతున్నారని, భారత్ లో మైనారిటీలకు న్యాయం జరుగుతోందని సాక్షాత్తూ ఓ అమెరికా కంపెనీ సర్వేలో తేలిందన్నారు. కానీ అమెరికాలో ఎందుకు ఇలాంటి వాతావరణం లేదని ప్రశ్నించారు.

కొన్ని రోజుల క్రిందట కూడా హిందూ అర్చకుడ్ని దుండగులు కాల్చి చంపారని, అమెరికాలోని హిందువులపై హింస పెరిగిపోయిందన్నారు. అయినా… బాధ్యులపై అక్కడి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మహారాజ్ నిలదీశారు. మరోవైపు తమ మహాసభ వారు బంగ్లాదేశ్ లో హిందువులపై జరిగిన దాడులను ఖండిస్తూ నిరసన వ్యక్తం చేస్తుంటే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని మండిపడ్డారు. ఈ సమస్యలను పరిష్కరించడంలో భారత ప్రభుత్వం మరింత చురుగ్గా వ్యవహరించాలని సూచించారు. వివిధ దేశాల్లో హిందువులపై జరుగుతున్న దాడులను భారత ప్రభుత్వం అంతర్జాతీయ వేదికపై ప్రస్తావించాలని చక్రపాణి మహారాజ్ డిమాండ్ చేశారు.