News

లవ్ జిహాద్… ల్యాండ్ జిహాద్…. ఇప్పుడు పాన్ కార్డ్ జిహాద్

0views

లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ అన్న పదాలు విన్నాం. కానీ.. పాన్ కార్డ్ జిహాద్ అని ఎప్పుడైనా విన్నామా? ఇప్పుడు వినాల్సి వస్తోంది. దాని గురించి తెలుసుకోవాల్సి వచ్చింది. మహారాష్ట్ర కేంద్రంగా దుండగులు ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది. మల్వాద్ వెస్ట్ లోని మల్వానీ ప్రాంతంలో పాన్ కార్డ్ జిహాద్ జరుగుతోంది. కొందరు ఛాందసులు నకిలీ పాన్ కార్డులు సృష్టించి, మార్కెట్లోకి పంపిస్తున్నారు.

నకిలీ పాన్ కార్డులు సృష్టిస్తూ.. మార్కెట్ ను అతలాకుతలం చేస్తున్నారంటూ బీజేపీ నాయకుడు ఆచార్య పవన్ త్రిపాఠి ఫిర్యాదుతో ఇది వెలుగులోకి వచ్చింది. మరోవైపు పోలీసులు కూడా దర్యాప్తు ప్రారంభించారు. ఈ పాన్ కార్డ్ జిహాద్ పై సమగ్ర దర్యాప్తు చేయాలని అధికారులను మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఈ విషయాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలకు కూడా తెలియజేయాలని డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ ముంబై పోలీస్ కమిషనర్ ను ఆదేశించారు.

ముంబైలోని ఇస్లామిక్ మెజారిటీ ప్రాంతాల్లో అసాధారణ సంఖ్యలో పాన్ కార్డులు జారీ అవుతున్నాయని, స్థానికంగా ఎంత జనాభా అయితే వుంటుందో, అంతకు మించిన మోతాదులో అవి వున్నాయని ముంబై బీజేపీ ఉపాధ్యక్షుడు పవన్ త్రిపాఠి ప్రభుత్వానికే ఫిర్యాదు చేశారు. ఇలా నకిలీ పాన్ కార్డులు సృష్టిస్తూ ఆర్థిక లావాదేవీలు, మనీ లాండరింగ్ కి పాల్పడుతున్నారని, మరికొన్నింటిలో ఈ నకిలీ పాన్ కార్డులను విరివిగా వాడుతున్నారని పేర్కొన్నారు. కేవలం ఆరోపణలు మాత్రమే కాకుండా… త్రిపాఠి దీనికి సంబంధించిన పూర్తి సాక్ష్యాలను కూడా సమర్పించారు. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.

ఛాందసులు నకిలీ పాన్ కార్డులతో పాటు నకిలీ ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు, రేషన్ కార్డులు, ఆయుష్మాన్ భారత్ కార్డులతో పాటు మరికొన్నింటిని కూడా సృష్టించే అవకాశాలున్నాయని హెచ్చరించారు. మాల్వా ప్రాంతంలో కొందరు బహుళ పాన్ కార్డులు కలిగివున్నారని, వీరు నల్ల ధనాన్ని తెల్ల గా మార్చడానికి, చట్ట విరుద్ధ కార్యకలాపాలను చట్టబద్ధం చేయడానికి వాడుతున్నారన్నారు.

ఇస్లాంవాదులు లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ వంటి వాటిలో వున్నారని, అలాగే ముస్లింలు అధికంగా వుండే ప్రాంతాల్లో ఈ పాన్ కార్డ్ జిహాద్ నడుస్తోందని త్రిపాఠి అన్నారు. మలాద్ పశ్చిమ నియోజకవర్గంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఇది బాగా మితిమీరిపోయిందన్నారు.