News

పాకిస్తాన్‌పై సౌదీ అరేబియా ఆగ్రహం

38views

పాకిస్తాన్ పై సౌదీ అరేబియా మరోమారు ఆగ్రహం వ్యక్తం చేసింది. హజ్ యాత్రకు పాకిస్తాన్ కు చెందిన యాచకులను విసాపై పంపుతున్నారని చివాట్లు పెట్టింది. పాకిస్తాన్ ఇప్పటికైనా ఈ విషయంపై దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది.

ఉమ్రా, హజ్ వీసాలతో పాకిస్తానీ బిచ్చగాళ్ళు తమ దేశంలోకి పెద్దసంఖ్యలో వస్తున్నారని సౌదీ అరేబియా చెబుతోంది. బిక్షాటన చేస్తోన్న పలువురు పాకిస్తానీయులను పట్టుకున్న సౌదీ అరేబియా అధికారులు వారిని తిరిగి స్వదేశానికి పంపుతున్నారు.

సౌదీ అరేబియా హెచ్చరికలను పాకిస్తాన్ మత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా నిర్ధారించింది. పాకిస్తాన్ హోంమంత్రి మొహిసిన్ నక్వీ స్పందిస్తూ, పెద్ద సంఖ్యలో బిచ్చగాళ్లను సౌదీ పంపే విషయంలో ఓ మాఫియా పనిచేస్తోందని ఆరోపించారు.

బెగ్గర్ మాఫియా కారణంగా అంతర్జాతీయంగా పాకిస్తాన్ పరువు పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ)ని ఆదేశించారు.