News

శ్రీశైలంలో అపచారం: నంది ముందు మాంసాహారం భుజించిన ముస్లిములు

268views

హిందువులు పరమ పవిత్రంగా భావించే జ్యోతిర్లింగక్షేత్రం శ్రీశైలంలో అపచారం జరిగింది. హిందువుల ఆచార వ్యవహారాలను అవమానించేలా కొందరు ముస్లిములు వ్యవహరించారు. శ్రీశైలంలో కొత్తగా నిర్మిస్తున్న ఆలయ ఆవరణలోకి చొరబడి మాంసాహారం భుజించారు. ఆ విషయాన్ని గ్రహించిన కొందరు స్థానికులు ఆగ్రహావేశాలతో వారిని నిలదీయడంతో అక్కడినుంచి వెళ్ళిపోయారు. ఆగస్టు 10న జరిగిన ఈ సంఘటన సుమారు వారం రోజుల ఆలస్యంగా బైటపడింది.

దేవాలయాల ఆవరణల్లోనూ, ఆలయ పరిసర ప్రాంతాల్లోనూ, దేవీదేవతల విగ్రహాల వద్ద మాంసాహారం భుజించడం నిషిద్ధం. అలా చేయడాన్ని హిందువులు పరమ పాపంగా భావిస్తారు. హిందూ దేవీదేవతల విగ్రహాలు ఉన్నచోటకు ఉద్దేశపూర్వకంగా వచ్చి మాంసాహారం తినడం స్థానిక భక్తులకు తీవ్ర ఆవేదన కలిగించింది.

గణపతి, నంది విగ్రహాలు ఉన్నచోటకు వచ్చి ముస్లిములు, వారిలో ఎక్కువ మంది బురఖాలు వేసుకున్న మహిళలు, మాంసాహారం తినడాన్ని స్థానికులు అడ్డుకున్నారు. అదేమిటని ప్రశ్నించినప్పుడు అక్కడ తినకూడదని తమకు తెలియదంటూ ఆ ముస్లిం మహిళలు అమాయకత్వం నటించారు. అయితే వారి వాదనను స్థానికులు నమ్మలేదు. ఒక పుణ్యక్షేత్రంలో అందునా దేవతల విగ్రహాలు ఉన్నచోట మాంసాహారం తినకూడదన్న సంగతి సర్వసాధారణంగా అందరికీ తెలిసే విషయమే. అంత చిన్న విషయం కూడా తెలియదని చెబుతున్నారంటే వారు ఉద్దేశపూర్వకంగానే ఆ ప్రదేశపు పవిత్రతను భగ్నం చేయాలన్న దురాలోచనతోనే అక్కడ మాంసాహారం తినడం మొదలుపెట్టారని అర్ధమవుతోంది. అది పొరపాటు కాదు, కావాలని చేసిన దుర్మార్గమని స్థానికులు మండిపడుతున్నారు. ఆ ఘటన తాలూకు వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం పొందడంతో హిందూసమాజం తీవ్ర ఆవేదనకు లోనవుతోంది.

దురదృష్టవశాత్తు, ఇలాంటి సంఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదు. ఈ యేడాదే ఫిబ్రవరి నెలలో ఇటువంటి సంఘటనే తెలంగాణలోని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంలో చోటు చేసుకుంది. ఒక క్రైస్తవ పాఠశాల యాజమాన్యం అక్కడికి విద్యార్ధులను విహారయాత్రకు తీసుకొచ్చి ఆ పిల్లలకు గుడి ఆవరణలో మాంసాహార భోజనం పెట్టింది. ఆ క్రైస్తవ పాఠశాల యాజమాన్యం ఉద్దేశపూర్వకంగానే హిందువుల ఆచార సంప్రదాయాలను అవమానించే దురుద్దేశంతోనే ఆ పనికి పూనుకుంది. తర్వాత కంటితుడుపు చర్యగా పాఠశాల యాజమాన్యం క్షమాపణ చెప్పినప్పటికీ, ఆ సంఘటన హిందువులకు తీవ్ర ఆవేదన కలిగించింది.

తరచూ జరుగుతున్న ఇలాంటి సంఘటనలను చూస్తుంటే, అవి ప్రమాదవశాత్తు జరిగినవి కాదనీ, హిందువుల మతపరమైన సెంటిమెంట్లను అవమానించడానికి ఉద్దేశపూర్వకంగా ప్రణాళికాబద్ధంగా చేస్తున్న కుట్రలనీ అనుమానాలు కలుగుతున్నాయి. ఇటువంటి రెచ్చగొట్టే చర్యలతో హిందూ సమాజంలో ఆందోళన కలుగుతోంది. తమ మత సంప్రదాయాల గౌరవానికి భంగం కలిగించేలా, హిందూ తటస్థుల్లోనూ ధార్మిక ప్రదేశాల పట్ల నిరాదరణ కలిగేలా చేసే ఈ చర్యలతో హిందువుల మనోభావాలను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తమ ధార్మిక ప్రదేశాల్లో వాటిని అవమానించే ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, తమను రెచ్చగొట్టే ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ఇతర మతాల వారిని నియంత్రించాలనీ హిందువులు ప్రభుత్వాలను కోరుతున్నారు.