News

సరిహద్దులకు బంగ్లాదేశ్‌ రోగి.. సాయమందించిన బీఎస్‌ఎఫ్‌

57views

బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. హింసాయుత ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో భారత బీఎస్‌ఎఫ్‌ జవాన్లు ఒక బంగ్లాదేశ్‌ రోగికి సాయమందించి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.

వివరాల్లోకి వెళితే బంగ్లాదేశ్ నుండి ఒక మానసిక వికలాంగ రోగిని అతని కుమారుడు అంబులెన్స్‌లో భారత సరిహద్దులకు తీసుకువచ్చాడు. బాధితుని పరిస్థితిని గమనించిన బీఎస్‌ఎఫ్‌ జవాన్లు అతనికి మెగుగైన చికిత్స అందించేందుకు బెంగళూరుకు తరలించారు. తండ్రిని ఆస్పత్రిలో చేర్పించేందుకు బంగ్లాదేశ్‌లో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో కుమారుడు అతనిని భారత్‌ తీసుకువెళ్లాలని అనుకున్నాడు. అనంతరం బీఎస్‌ఎఫ్‌ సాయం కోరాడు.

కాగా భారత్-బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దు పూర్తిగా మూసివేశారు. రెండు దేశాల మధ్య కమ్యూనికేషన్ మార్గంగా నిలిచిన ఫ్రెండ్‌షిప్ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు. దీంతో వేలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు బంగ్లాదేశ్‌లోని బురిమరీ ల్యాండ్ పోర్ట్‌లో 207 మంది భారతీయులు ట్రక్కులతో చిక్కుకుపోయారు. బంగ్లాదేశ్‌లో హింస, రాజకీయ అస్థిరత కారణంగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం దెబ్బతింటోంది.