ArticlesNews

వేదాంత గురువులు

55views

ప్రతి మతంలోనూ ప్రత్యేక ఆచార వ్యవహారాలు అంటాయి అలాగే హైందవి ధర్మంలో గర్భస్థ శిశువు మొదులు మరణం వరకూ జరిపే సంస్కారాలను షోద సంస్కారాలు అంటారు. వీటిల్లో మనిషి ఉన్నతికి దోహదపడే ‘అక్షర’ సంస్కారం’ లేదా ‘విద్యాభ్యాస సంస్కారం’ ఎంతో విశిష్టమైనది ఇది మనిషిని పాశవిక ప్రవృత్తి నుంచి మానవత్వానికి, అనాగరికత నుంచి నాగరికతకు చీకటి నుంచి వెలుగులోకి ఆస్థానం నుంచి ఇనానికి, మానవత్వం నుంచి దివ్యత్వానికి చేర్చగలదు. ఇంతట్ విశిష్ట ప్రయోజనాలను సమకూర్చే ఈ సంస్కారం సద్గురుసేవ, వారి కటాక్ష వీక్షణంలోనే లభ్యమవుతుంది.

దర్బ పోచ కొన(అగ్రం) చాలా వాడిగా ఉంటుంది. అందుకే సూక్ష్మ గ్రహణ బుద్ధి కలవారిని కుశాగ్ర బుద్ధిమంతులు బంటారు. వీరు తమ బుద్ధిబలంతో గురూపదేశానికి మెరుగులు దిద్దుకోగలరు. రోకటి పొన్నులా మండబుద్ధి గల ముసలాగ్ర బుద్ధిజులు గురువులు ఎంత బోచించినా గ్రహించలేరు. బోధించిన వాన్ని విపరీత అర్థంలో చేసుకునే ప్రమాదమూ ఉంది. మట్టిముద్దకు నీరు తగంగానే మెత్తబడి తడి ఆరిపోగానే మళ్లీ గట్టిపడుతుంది. అలాగే మృత్పింద బుద్ధి కలవారు కూడా గురూపదేశం ఉన్నంత వరూ పండితులుగా చెలామణి అయి వారి ఉపదేశాలు ఆగిపోగానే మూర్ఖుల జాబితాలోకి చేరతారు.
పైన పేర్కొన్న శిష్యుల్లో రెండు వర్గాలవారు. సరైన గురువు లభిస్తే మేధావులుగా మారతారు ఇలాంటి సందర్భాల్లోనే గురు కటాక్ష బలం అర్ధం అవుతుంది. ఆదిశంకరుల శిష్యరికం చేసినవారిలో పద్మపాదుడు గురు కటాక్షానికి పాత్రువైనట్టుగా జీవితచరితం చెబుతోంది.

ఈ త్రివర్ణ శిష్యగణమే కాకుండా మేష, మహిష జాతి శిష్యులు కూడా ఉన్నాడు. మహిషం నీటిగుంటలో మిగితే అడ్డదిడ్డంగా చేస్తుంది. ఆ నీరు ఇతరులకు ఉపయోగ పడకుండా చేస్తుంది. అదేవిధంగా మహిష జాతి శిష్యుడు తాను చదువుకోకపోగా క్రమశిక్షణను ఉల్లంఘించి తోటి విద్యార్థులను కూడా చెడగొడతాను.మేషం(మేక) చాలా చురుకైన బంతువు నీటిని కెలక్కుండా ఒడ్డున నిలబడి తాగుతుంది. అలాంటి శిష్యులు వినయంగా విద్యాబుద్ధులు నేర్చుకుని పేరు. ప్రతిష్టలు సంపాదించుకుంటారు.

శంకర భగవత్పాదులవారు తమ వివేక చూడామణి గ్రంథంలో బ్రహ్మవిద్యకు మేధావి, విద్వాంసుడు, మంచి ఊహకలవాడు, విచక్షణా జ్ఞానసంపన్నుడుగా ఉన్నవాడే అధికారిగా ఉండాలని తెలియజేశాడు. ఇలాంటి ఉత్తమ లక్షణ సంపన్నులే విద్యను పొందేందుకు అర్హులు అవుతారు.గురువుల్లో సాధారణ గురువులు, సద్గురువులు అని రెండు రకాలు సాదారణ గురువులు అక్షర దాతలు మాత్రమే సద్గురువులు ముసలాగ్రబుద్ధులు, మృత్పిండ బుద్ధులు అయిన శిష్యులను కూడా ఆనుగ్రహించి విద్యాబుద్ధులు నేర్చి ప్రయోజకుల్ని చేస్తారు. ఇలాంటివారు మనకు చాలా తక్కువగా కనిపిస్తాడు శంకర భగవత్పాదులు, గౌడయతీంద్రులు, వేదవ్యాసమహర్షి, శ్రీరామకృష్ణ పరమహంస ఈ కోవకు చెందిన గురుదేవులుగా కీర్తిని అందుకున్నాడు. వీరిని వేదాంత గురువులని సంబోధించారు. విద్యాదానం కన్నా వేదాంత విద్యోపదేశం చేయడం పవిత్రమైనది. గురువులుగా గుర్తింపుపొందిన వారిలో డాంబికులు ఎవరో సద్గురువులు ఎవరో తెలుసుకున్నాకే గురుస్వీకారం చేసుకోవాలి. సద్గురువుల కటాక్షం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అనే స్థితిని కల్పిస్తుంది.