News

విశ్వ గురువుగా భారత దేశం

51views

అఖిల భారతీయ రాష్ట్రీయ పేక్షిక్ మహాసంఘ్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, ఆధ్వర్యంలో “జాతీయ విద్యా విదానం’పై రెండు రోజుల సదస్సు విజయవాడ నగరంలో నిర్వహించారు. “ఉన్నత విద్యలో జాతీయ విద్యా విధానం అమాలు, సవాళ్లు” అనే అంశంపై ఈ సదస్సులో పలువురు విద్యా వేత్తలు పాల్గొన్నారు. విశ్వ మంతటికీ “విశ్వ గురువుగా భారత దేశం శోభిల్లాలని” అందుకు నూతన జాతీయ విద్యా విధానం 2020ను అమలు చేయడం మంచి మార్గమని విద్యావేత్తలు ఈ సందర్భంగా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం డీన్ శివ రామ ప్రసాద్ మాట్లాడుతూ, ప్రపంచానికి జ్ఞానభూమిగా,వేదభూమిగా, శాస్త్ర సాంకేతిక రంగాలతో నిత్య నూతన వైజ్ఞానిక భూమిగా ప్రకాశించిన మన భారతదేశానికి పూర్వ వైభవం తీసుకు రావాల్సిన బాధ్యత నేటి విద్యా వ్యవస్థపై ఉందని పేర్కొన్నారు.