News

శ్రీమఠంలో అష్టోత్తర పారాయణం ప్రారంభం

48views

కర్నూలు జిల్లా మంత్రాలయంలో వేద పండితుల మంత్రోచ్ఛరణాలు, మంగళవాయిద్యాల మధ్య పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల ఆధ్వర్యంలో సామూహిక అష్టోత్తర పారాయణం ప్రారంభించారు. ఆదివారం అమావాస్యను పురస్కరించుకుని తుంగభద్ర నదిలో పండితులు, శిష్యులతో కలిసి పుష్కర యోగాలో భాగంగా పుణ్యస్నానాలు ఆచరించి భక్తులకు నీళ్లు చల్లి ఆశీర్వదించారు. అనంతరం ఊంజల మండపంలో రజిత ఊయలలో రాఘవేంద్రస్వామి విగ్రహాన్ని ఉంచి హారతులు ఇచ్చారు. చాతుర్మాసదీక్షల్లో భాగంగా సామూహిక అష్టోత్తర పారాయణం శ్రీరాఘవేంద్రస్వామి స్ర్తోత్త్ర అష్టోత్తర పారాయణం, దండోదక స్నానం ఆచరించారు. అనంతరం భక్తులనుద్దేశించి పీఠాధిపతి మాట్లాడారు. వివిద రాష్ట్రాల నుంచి వచ్చిన పండితులు సాంప్రదాయ శాస్త్రోక్తంగా పీఠాధిపతులకు పట్టువస్త్రాలు సమర్పించి గురుభక్తిని చాటుకున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులకు పీఠాధిపతి శేషవస్త్రం, ఫలఫుష్ప మంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు.