News

రామనగర పేరును మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం

71views

శ్రీరాముడి పేరును కాంగ్రెస్ ఎందుకు అంతగా ద్వేషిస్తుంది? అనేది ఇప్పుడు సనాతన ధర్మ వాదులు అడుగుతున్న ప్రశ్న ? ఎందుకంటే ఆ పార్టీ ఎప్పటిలానే కాంగ్రెస్ ప్రభుత్వం రామునికి వ్యతిరేకంగా మరో చర్యకు పాల్పడింది.

కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం రామనగర పేరును బెంగళూరు సౌత్‌గా మార్చింది. రామనగర అని ఉంచాలని ప్రజలు కోరుకున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పేరు మార్చంది.

దీంతో ఎన్నికల సమయంలో హిందువులమంటూ దేవాలయాల చుట్టూ తిరుగుతున్న రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీల బూటకపు రూపం మళ్లీ బట్టబయలైందని సనాతన వాదులు చెప్తున్నారు.

భగవంతుడు శ్రీరాముడిని కాల్పనికమని పిలిచే కాంగ్రెస్ చరిత్ర ఎప్పుడూ సనాతన ధర్మానికి వ్యతిరేకమే.

దేశంలోని హిందూ పేర్లను, హిందూ చిహ్నాలను చెరిపేయడం కాంగ్రెస్ కొనసాగిస్తూనే ఉంటుందా?అని ప్రశ్నిస్తున్నారు.