News

టోక్యోలో గాంధీజీ విగ్రహం ఆవిష్కరణ

34views

ప్రపంచంలో ఘర్షణలు, రక్తపాతం, విభజన వాదం పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో మహాత్మా గాంధీ ప్రబోధించిన శాంతి, అహింస సందేశానికి మరింత ప్రాముఖ్యత ఏర్పడిందని జైశంకర్ పేర్కొన్నారు. టోక్యోలోని ఫ్రీడం ప్లాజాలో ఏర్పాటు చేసిన గాంధీజీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “సమస్యలకు పరిష్కారాలు యుద్ధభూమిలో లభించవు. ఏ యుగంలోనూ యుద్ధానికి చోటు లేదు. 80 ఏళ్ల క్రితం గాంధీజీ చెప్పిన ఈ మాటలకు ఎప్పటికీ కాలదోషం పట్టదు. ఆయన చూపిన సమ్మిళిత పథంలోనే భారత్ పయని స్తోంది. ఆయన కృషి లేకుంటే భారత్ కు స్వాతంత్య్రం రావడానికి మరింత కాలం పట్టేది” అని జైశంకర్ పేర్కొన్నారు. టోక్యోలో భారతీ యులు అధికంగా నివసిస్తున్న ప్రాంతంలో ఉన్న పార్కుకు గాంధీ పేరు పెట్టనుండటంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.