News

అయోధ్య రామాలయ వాచీలను రూపొందించిన స్విట్జర్లాండ్‌, భారత్ కంపెనీలు

49views

స్విట్జర్లాండ్‌కి చెందిన జాకబ్‌ అండ్‌ కో వాచ్‌ కంపెనీ, భారత్‌కి చెందిన ఎథోస్‌ సంయుక్తంగా రామజన్మభూమి సిరీస్‌ వాచీలను రూపొందించాయి. ”ఎపిక్‌ ఎక్స్‌ స్కెలిటెన్‌” సిరీస్‌లో భాగంగా విడుదలైన ఈ వాచీ ధర 34 లక్షల రూపాయలు. ఈ వాచీలో ఉదయం 6 గంటలకు, సాయంత్రం 6 గంటలకు జైశ్రీరామ్‌ అని వినిపిస్తుంది. అలాగే 9 గంటలకు రెండు పుటలా అయోధ్య రామాలయాన్ని చూపిస్తుంది. దీనితో పాటు శ్రీరాముడు, హనుమంతుడ్ని ప్రధానంగా వుండేలా ఈ వాచీని డిజైన్‌ చేశారు. భారతీయ సంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తూ డిజైన్‌ చేసినట్లు కంపెనీ ప్రకటించింది. కేవలం 49 లిమిటెడ్‌ ఎడిషన్‌ వాచీలను మాత్రమే తాము తయారు చేశామని, ఇప్పటికే 35 వాచీలు అమ్ముడు పోయినట్లు ప్రకటించింది .