News

పురాతన సంపదను సంరక్షించుకుందాం

48views

కాకినాడ నగరంలో పురాతన సంపద, కట్టడాలను సంరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వాటర్‌ మన్‌ ఆఫ్‌ ఇండియా, రామన్‌ మెగసెస్‌ అవార్డు గ్రహీత, పద్మభూషణ్‌ డాక్టర్‌ రాజేంద్రసింగ్‌ అన్నారు. స్థానిక జేఎన్‌టీయూ ప్రాంగణంలోని సెనేట్‌ హాలులో యూనివర్సిటీ మరియు పీపుల్స్‌ వరల్డ్‌ కమిషన్‌ ఆన్‌ డ్రాట్‌ (కరువు) అండ్‌ ఫ్లడ్‌ (వరద), పీడబ్ల్యూసీడీఎఫ్‌ సంస్థల సంయుక్త ఆధ్యర్యంలో వారసత్వ సంపద భవిష్యత్తు కార్యాచరణ అనే అంశంపై నగర ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారసత్వ సంపదలో ప్రకృతి వనరులు, మడ అడవులు, హోప్‌ ఐలాండ్‌, తీర ప్రాంతాలన్నీ భాగమని, వాటిని ప్రజలు రక్షించుకోవాలన్నారు. నీటి కొరత, నదుల ప్రక్షాళన, నదులు, భూమిలోని నీటిని సంరక్షించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. కాకినాడ వారసత్వ నగరంగా వెలుగొందుతుందని, ఇక్కడ మూడు రకాల వారసత్వ సంపదలు ఉన్నాయన్నారు. అవి పురాతన కళాశాలలు, జాతీయ వారసత్వ సంపద, మడ అడవులు అన్నారు.