News

అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా

42views

అస్సాంలో ఆహోమ్ రాజవంశీయులు నిర్మించిన సమాదులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. ఈశాన్య భారతం నుంచి ఈ జాబితాలో చేరిన మొట్టమొదటి వారసత్వ సంపద ఇదే. భారత్ లో జరుగుతున్న యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సమావేశాలలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అసోంలోని పిరమిడ్ల వంటి మట్టి సమాధులను మోయివమ్ అంటారు. 600 ఏళ్లపాటు అస్సాంను పాలించిన టాయ్-ఆహోం రాజవంశం తమ పూర్వీకులను చరాయ్ దేవ్లో మట్టితో పిరమిడ్ ఆకృతిలో నిర్మించిన దిబ్బలలో సమాధి చేసేది. ఈ సమాధి దిబ్బల పై పచ్చగడ్డి పెరిగి హరిత కళ ప్రసరిస్తుంది.