News

ఉగ్రవాదులకు సహకరిస్తున్న ఉద్యోగులను విధుల నుంచి తొలగింపు

70views

జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ భద్రతకు సంబంధించి తీవ్ర ఆరోపణల నేపథ్యంలో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. ఈ మేరకు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 311(2) (సి) కింద ఈ తొలగింపు వెంటనే అమల్లోకి వస్తుందని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇక వీరిపై ఎటువంటి విచారణ జరపకుండానే.. వారిని విధుల నుంచి తొలగించారు. దీంతో గత నాలుగేళ్లుగా ఉద్యోగులను తొలగించిన వారి సంఖ్య 64కు చేరింది.

అయితే తాజాగా విధుల నుంచి తొలగించిన ఉద్యోగుల్లో ఇద్దరు పోలీసులుండడం గమనార్హం. విధుల నుంచి తొలగించిన ఉద్యోగులకు.. నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని కారణంగా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఆ క్రమంలోనే సదరు ఉద్యోగులను విధుల నుంచి తప్పించినట్లు తెలుస్తుంది. అయితే దేశ భద్రతకు ప్రభుత్వ ఉద్యోగులు నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తితే.. వారిని తొలగించాలని ప్రభుత్వానికి ఆదేశించే అధికారం రాష్ట్రపతి లేదా గవర్నర్‌కు ఉంటుంది.

ఈ నేపథ్యంలో నలుగురు ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు.