News

దళిత బాలికలపై అత్యాచారం, దాడి: ఆరుగురు ముస్లిముల అరెస్ట్

57views

ఉత్తరప్రదేశ్‌లోని బహ్రయిచ్ జిల్లాలో ముగ్గురు దళిత బాలికలపై అత్యాచారం చేసి, మరికొందరిని గాయపరిచిన ఆరుగురు ముస్లిం యువకులను పోలీసులు అరెస్ట్ చేసారు.

బహ్రయిచ్ జిల్లాలోని బోధ్వా మార్కెట్‌కు ముగ్గురు దళిత బాలికలు ఆదివారం సాయంత్రం వెళ్ళారు. ఆ మార్కెట్‌లో మాంసం దుకాణం నిర్వహిస్తున్న అస్లాం, సల్మాన్ అనే ముస్లిం వ్యాపారులు వారిపై అత్యాచారానికి పాల్పడ్డారు.

విషయం తెలిసిన బాలికల బంధువులు అక్కడికి చేరుకుని, వారితో గొడవపడ్డారు. ఆ మాంసం వ్యాపారులు మరికొందరి సాయంతో బాలికల బంధువులపై పదునైన ఆయుధాలతో దాడి చేసారు. ఆ దాడిలో చాందిని, గుడ్డీ అనే ఇద్దరు అమ్మాయిలు, విజయ్‌సింగ్, పూరన్, శ్రావణ్ అనే ముగ్గురు వ్యక్తులు మొత్తం ఐదుగురు గాయపడ్డారు.

దాడి సంఘటన వీడియో వెంటనే వైరల్ అయింది. విషయం పోలీసులకు తెలిసి వారు వెంటనే స్పందించారు. ఎఎస్‌పి డాక్టర్ పవిత్రా మోహన్ త్రిపాఠీ తన బృందంతో కలిసి రంగంలోకి దిగారు. గాయపడిన వారిని నన్‌పరాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు.

దళిత బాలికలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితులుగా సల్మాన్ ఖురేషీ, అస్లాం ఖురేషీ, ఇబ్రహీం, హలేం ఖురేషీ, గుల్‌ఫాన్, రహీష్‌లను గుర్తించారు. వారిపై అత్యాచారం, దాడి, హత్య నేరాలకు సంబంధించిన సెక్షన్లతో ఛార్జిషీట్ దాఖలు చేసారు. వారిపై ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం కూడా కేసు నమోదు చేసారు. ఆ కేసుకు సంబంధించి మరికొందరు నిందితులు పరారీలో ఉన్నారు, వారి గురించి పోలీసులు వెతుకుతున్నారు.