NewsProgramms

ప్రకృతిని పూజించిన సంఘమిత్ర చిన్నారులు.

75views

“కంకర్ కంకర్ మే శివ శంకర్ హై” ప్రతి రాయిలో శంకరుడున్నాడు అంటూ పసి ప్రాయం నుండే ప్రకృతితో మమేకం చేస్తూ, నంద్యాల జిల్లా, సంఘమిత్ర సేవా సమితి ఆధ్వర్యంలో సంఘమిత్ర ఆవాసం చిన్నారులు స్వచ్చ భారత్ కార్యక్రమాలలో భాగంగా ప్రతి యేటా వర్షాకాలంలో చెట్లు నాటడం ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది గురుపౌర్ణమిని పురస్కరించుకొని నంద్యాల పట్టణంలో స్థానిక పద్మావతీ నగర్ లోని శ్రీ కృష్ణ మందిరంలో చెట్లను నాటి సంఘమిత్ర చిన్నారులు ప్రకృతిని పూజించారు.

సంఘ మిత్ర అధ్యక్షులు నాగ సుబ్బారెడ్డి, అతిథుల పూజతో ప్రారంభమైన కార్యక్రమం, ‌శాంతి పాఠంతో సంపన్నమైంది.కార్యక్రమం అనంతరం ఆలయ ఆవరణలో జరుగుతున్న కూచిపూడి నృత్య, భగవద్గీత అభ్యసన కార్యక్రమాలను సందర్శించి, డాక్టర్ ఉదయ శంకర్ విద్యార్థులతో నిస్వార్థ సేవ యొక్క గొప్పతనాన్ని తెలిపే చక్కని కథను చిన్నారులకు వివరించారు.

ఈ కార్యక్రమంలో సంఘమిత్ర వ్యవస్థాపకులు డాక్టర్ కాదర్ బాద్ ఉదయ శంకర్, సంఘమిత్ర కార్యవర్గం, చిన్నారులతో పాటు, దేవాలయ కమిటీ సభ్యులు పార్థసారధి కృష్ణ యాదవ్, విజయ్ చంద్రుడు యాదవ్, లక్ష్మణ్ కుమార్ యాదవ్, గోపాల్ యాదవ్, పృథ్వీ యాదవ్, చంద్ర శేఖర్ యాదవ్, మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.