News

భావితరాలకు భారతీయ శాస్త్ర విజ్ఞానం

58views

భారతీయ సంస్కృత శాస్త్రాలలోని విజ్ఞానాన్ని భావితరాలకు అందించడమే వర్సిటీ లక్ష్యంగా పనిచేస్తుందని వీసీ జీఎస్‌ఆర్‌ కృష్ణమూర్తి ఉద్ఘాటించారు. ‘కాళిదాసు సాహిత్యం, కావ్యం, సౌందర్యం–వైజ్ఞానికి వైభవం’ అను అంశంపై తిరుపతిలోని జాతీయ సంస్కృత వర్సిటీలో రెండురోజుల జాతీయ సదస్సు ప్రారంభంలో ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడారు. సంస్కృత శాస్త్రాల్లో ప్రాచీన కవులు భావితరాలకు ఉపయోగపడే ఎన్నో వైజ్ఞానికి అంశాలను నిక్షిప్తం చేశారని, ఆ శాస్త్రాల్లోని వైజ్ఞానిక సంపదను విద్యార్థులు అధ్యయనం చేయాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్‌కౌశిక్‌ మాట్లాడుతూ, శాస్త్రాల్లోని వైజ్ఞానికి, సామాజిక అంశాలను వెలికితీయడం కోసం ఇలాంటి జాతీయ సదస్సులు ఉపకరిస్తాయన్నారు. భారతీయ జ్ఞాన సంపదను వెలికితీసి భావితరాలకు అందించేందుకు కేంద్రప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తోందన్నారు.