News

ఐఏఎస్ ఉద్యోగం కోసం యూసుఫ్ తప్పుడు పత్రాలు ఇచ్చింది నిజమే : విచారణ అధికారి

49views

ఐఏఎస్ ఉద్యోగం సంపాదించడానికి ఆసిఫ్ కె యూసుఫ్ అనే అధికారి అడ్డదారులు తొక్కిన ఉదంతం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2016 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన యూసుఫ్.. ఓబీసీ రిజర్వేషన్ కేటగిరీలో ఉద్యోగం పొందడం కోసం తప్పుడు ఇన్‌కం సర్టిఫికెట్‌ను చూపించినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం.. చీఫ్ సెక్రటరీ రిపోర్టులోని అంశాల ఆధారంగా వెంటనే ఈ విషయంపై విచారణ జరిపించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విచారణలో యూసుఫ్ ఆదాయం ప్రకారం అతను నాన్-క్రీమీ లేయర్ క్వాలిఫికేషన్‌కు అనర్హుడని తద్వారా ఓబీసీ రిజర్వేషన్‌కు కూడా యూసుఫ్ అర్హుడు కాదని తేలింది. ఈ క్రమంలోనే ఇలాంటి మరెన్నో కేసులు ఉంటాయని, వీటిపై కూడా విచారణలు జరపాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇలా తప్పుడు ధ్రువపత్రాలతో ఉద్యోగాలు సంపాదించిన వారందరినీ జైలుపాలు చెయ్యాలని అంటున్నారు.