News

పరిపూర్ణానంద స్వామీజీ చేతుల మీదుగా ‘మోక్షానికి కులమా గుణమా’ పుస్తకావిష్కరణ

70views

వేదాలు, ఆధ్యాత్మిక శాస్త్రాలు నిర్దిష్ట వర్గానికి మాత్రమే అన్న అపోహను తొలిగించి అన్ని వర్ణాల వారికి సంస్కృతం నేర్పించి అందరికీ దైవజ్ఞానాన్ని అందించిన మహనీయుడు మలయాళ స్వామి. ఆయన ఆశయాలను ప్రతిబింబిస్తూ, రచయిత వల్లీశ్వర్ రచించిన ‘మోక్షానికి అర్హత కులమా గుణమా’ పుస్తకావిష్కరణ కార్యక్రమం తిరుపతి జిల్లా ఏర్పేడులోని శ్రీ వ్యాసాశ్రమంలో నిర్వహించారు. సామాజిక సమరసత వేదిక (కాళహస్తి) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వ్యాసాశ్రమ పీఠాధిపతులు శ్రీ పరిపూర్ణానందగిరి స్వాములు పాల్గొని పుస్తకాన్నితన చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వామీజీ తన దివ్య సందేశాన్ని అందించారు. భారతీయ సంస్కృతి ఎంతో గొప్పదని, కేవలం భారతదేశ సంస్కృతి వలనే ప్రపంచదేశాలలో నాగరికత ఏర్పడిందన్నారు. ఈ సృష్టిలో ఎన్నో జీవరాశులు ఉన్నాయని వాటన్నింటిలో మానవ జన్మ ఒక వరం అన్నారు. ఎన్నో పుణ్యకార్యాలు చేస్తేనే లభించే మానవ జన్మను పరోపకారానికి ఉపయోగించాలని స్వామీజీ హితోపదేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన సామాజిక సమరసత చేస్తున్న సేవలను ప్రస్తుతించారు.

అనంతరం రచయిత వల్లీశ్వర్ ప్రసంగించారు. మలయాళ స్వామీజీ సందేశాన్ని విశ్వవ్యాప్తం చేసే దిశగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే ‘మోక్షానికి అర్హత కులమా గుణమా’ పుస్తకాన్ని పాఠకుల ముందుకు తెచ్చానన్నారు. వేదాంత అంతర్గత సమరసతా సుగంధాలైన మలయాళ స్వామీజీ గ్రంథాలను ప్రపంచ వ్యాప్తి చేయాల్సిన అవసరం నేడు ఉందన్నారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి పి.వీరాస్వామి అధ్యక్షత వహించగా వేణుగోపాల్ నాయుడు ప్రధాన వక్తగా వ్యవహరించారు. సమరసత సాధన దిశగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ చేస్తున్న కార్యాన్ని ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సమరసత సంయోజకులు రాగాల నర్సింగరావు నాయుడు, రాష్ట్ర అధ్యక్షులు మన్మథరావు, అంజూరు బాలసుబ్రహ్మణ్యం, శంకరయ్య, నెల్లూరు జిల్లా వేదిక అధ్యక్షులు నేలనూతల శ్రీధర్, సమరసత నాయకులు భాస్కర్ రెడ్డి సుబ్బరామిరెడ్డి, అమర్‌నాథ్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మహిళా ప్రముఖ్ డాక్టర్ రేణు దీక్షిత్, వెంకటగిరి, నెల్లూరు, శ్రీకాళహస్తి, తిరుపతికి చెందిన వేదిక ప్రముఖులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సమరసత సంయోజకులు రాగాల నర్సింగరావు నాయుడు , రాష్ట్ర అధ్యక్షులు మన్మధరావు, అంజూరు, బాలసుబ్రహ్మణ్యం శంకరయ్య, నెల్లూరు జిల్లా వేదిక అధ్యక్షులు నేలనూతల శ్రీధర్, సమరసత నాయకులు భాస్కర్ రెడ్డి సుబ్బరామిరెడ్డి, అమరనాథరెడ్డి, ఆంధ్రప్రదేశ్ మహిళా ప్రముఖ్ డాక్టర్ రేణు దీక్షిత్‌తో పాటు వెంకటగిరి, నెల్లూరు, శ్రీకాళహస్తి, తిరుపతి నుంచి వేదిక ప్రముఖులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.