News

తుది విడత చందనం అరగదీత

49views

సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో నుంచి తుది విడత చందనం అరగదీత(ఆఖరి విడత) ఘనంగా ప్రారంభమైంది. ఈనెల 21న ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని ఆరోజు స్వామికి సమర్పించేందుకు అవసరమైన మూడు మణుగుల పచ్చిచందనం(120కిలోలు) అరగదీత చేపట్టారు. ఉదయం 7 గంటల నుంచి నాల్గవ తరగతి సిబ్బంది చందనం అరగదీతను శాస్త్రోక్తంగా ప్రారంభించారు. కాగా ఏడాదిలో నాలుగు విడతలుగా స్వామికి మూడేసి మణుగుల చొప్పున(120 కిలోల చొప్పున) పచ్చి చందనం సమర్పిస్తారు. చందనోత్సవం రోజు రాత్రి, వైశాఖ పౌర్ణమి, జ్యేష్ట పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి రోజుల్లో తెల్లవారుజామున మూడేసి మణుగుల చొప్పున చందనాన్ని సమర్పిస్తారు. ఇప్పటికే గత చందనోత్సవం, వైశాఖ పౌర్ణమి, జ్యేష్ట పౌర్ణమి రోజుల్లో మూడు విడతల చందనం సమర్పణ పూర్తయింది. ఆఖరి విడతగా ఈనెల 21న సమర్పిస్తారు.