News

జమ్మూకశ్మీర్‌లో 30 ఏళ్లకు తెరచుకున్న ఆలయం

83views

మూడు దశాబ్దాల తర్వాత జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో ఉమా భగవతి అమ్మవారి ఆలయం తెరచుకుంది. కేంద్రమంత్రి నిత్యానంద్‌ రాయ్‌ సమక్షంలో ఆదివారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పునరుద్ధరణ పనుల అనంతరం భక్తుల కోసం ఆలయాన్ని తెరిచినట్లు అధికారులు తెలిపారు. రాజస్థాన్‌ నుంచి తెప్పించిన ఉమా దేవి విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠాపన చేశారు. ఆలయాన్ని పునరుద్ధరించడంపై స్థానికులు హర్షం ప్రకటించారు. 1990లో కూల్చివేసిన ఉమా భగవతి అమ్మవారి ఆలయం పునరుద్ధరణ జరిగినట్లు కేంద్రమంత్రి నిత్యానంద్‌ రాయ్‌ వెల్లడించారు.