
249views
సంఘ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా సామాజిక మార్పునకు సంబంధించి ఐదు కార్యక్రమాలను శాఖా స్థాయికి తీసుకెళ్లే ప్రణాళిక పై చర్చించనున్నామని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ తెలిపారు.జరగనున్న అఖిల భారతీయ ప్రాంత ప్రచారక్ బైఠక్ గురించి ఝార్ఖండ్ లోని రాంచిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంఘ శతజయంతి సంవత్సరం సమీపిస్తోందన్నారు. 2025 విజయదశమితో సంఘ పని ప్రారంభమై 100 సంవత్సరాలు పూర్తవుతుందని 2025-26 సంవత్సరం సంఘ శతజయంతి సంవత్సరం కావున, ఈ సందర్భంలో ఎలా వ్యవహరించాలి, ఉత్సవాలను ఏ పద్ధతిలో నిర్వహించాలి అనే విషయంపై చర్చలు సాగుతున్నాయని తెలిపారు. అలాగే శాఖ స్థాయి కార్యకలాపాలు, సంస్థాగత కార్యక్రమాలు మరియు కార్యకలాపాలపై కూడా చర్చించనున్నామని సునీల్ అంబేకర్ పేర్కొన్నారు.