News

తొలిసారిగా భారత్‌ స్నైపర్‌ రైఫిల్స్‌ ఎగుమతి

103views

బెంగళూరుకు చెందిన చిన్న ఆయుధాల తయారీ సంస్థ ఎస్‌ఎస్‌ఎస్‌ డిఫెన్స్‌ శక్తిమంతమైన ‘.338 లాపువా మాగ్నమ్‌ క్యాలిబర్‌ స్నైపర్‌ రైఫిల్స్‌’ ఎగుమతి కోసం ఓ మిత్ర దేశం నుంచి మెగా కాంట్రాక్టును దక్కించుకుంది. భారత్‌… స్నైపర్‌ రైఫిళ్లను విదేశాలకు ఎగుమతి చేయడం ఇదే తొలిసారని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ స్నైపర్‌ రైఫిళ్లను బ్యారెల్‌తో సహా పూర్తిగా భారత్‌లోనే తయారు చేశారు. ఈ రైఫిళ్లతోపాటు పలు మిత్రదేశాల నుంచి దాదాపు రూ.418 కోట్ల విలువైన రక్షణ సామగ్రిని సరఫరా చేసే కాంట్రాక్టును కూడా ‘ఎస్‌ఎస్‌ఎస్‌ డిఫెన్స్‌’ దక్కించుకుంది. ఎస్‌ఎస్‌ఎస్‌ డిఫెన్స్‌ సంస్థ ఇప్పటికే 1,500 మీటర్లు, అంతకంటే ఎక్కువ దూరంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం కలిగిన స్నైపర్‌ రైఫిళ్ల ఎగుమతిని పూర్తిచేసిందని రక్షణ వర్గాలు వెల్లడించాయి.