
విజయవాడ దుర్గగుడిలో సెక్యూరిటీ వ్యవస్థ పటిష్టతపై ఆలయ అధికారులు, పోలీసు అధికారులు మంగళవారం సమావేశమయ్యారు. 2020లో ఆలయ సెక్యూరిటీ వ్యవస్థ, ఇతర అంశాలపై తీసుకోవాల్సిన చర్యలకు ఇదే తరహాలో సమీక్షించి నివేదిక తయారు చేశారు. నాటి సూచనలతో పాటు తాజా పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని పలు సూచనల కోసం ఆలయంలోని డోనర్‌సెల్‌లో కీలక సమావేశాన్ని నిర్వహించారు. సెక్యూరిటీ విభాగం, సీసీ కెమెరాల నిర్వహణ, భక్తులు ప్రవేశించే.. నిష్క్రమించే మార్గాలు, క్యూలు, అత్యవసర మార్గాలు, భక్తుల రద్దీ సమయాలలో అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చించారు. బుధవారం కూడా సమావేశాన్ని కొనసాగించి నివేదికను రూపొందించనున్నారు. ఆలయానికి భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపధ్యంలో పరిమిత స్థలంలోనే ఎటువంటి ఏర్పాట్లు ఉండాలన్న దానిపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయనున్నారు. డీసీపీలు ఏబీటీఎస్ ఉదయరాణి, వె స్ట్‌జోన్ డీసీపీ హరికృష్ణ, డీసీసీ మురళీకృష్ణారెడ్డి, ఇంటెలిజెన్స్ డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఈవో రామారావు డిప్యూటీ ఈవో లీలాకుమార్, ఈఈ కోటేశ్వరరావు, ట్రాఫిక్, అగ్నిమాపక, ఆర్ అండ్ బీ, మునిసిల్ కార్పొరేషన్, విద్యుత్ తదితరడిపార్ట్‌మెంట్ల అధికారులు, వన్‌టౌన్ సీఐ, ఆలయ ఎస్‌పీఎఫ్, ఎగిల్ సంస్థ అధికారులు పాల్గొన్నారు.