ArticlesNews

ముస్లింలు పూజాసామగ్రి అమ్మకుండా నిలువరించాలి: విశ్వ హిందూ పరిషత్

700views

హిందూ దేవాలయాలు, తీర్థయాత్రల ప్రాంతాలలో ముస్లింలు ప్రసాదాలు, ఆహార పదార్థాలు, పూజా సామగ్రి విక్రయించకుండా దుకాణాలను మూసివేయాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేసింది. విహెచ్‌పి కేంద్ర ప్రధాన కార్యదర్శి బజరంగ్ బాగ్రా మాట్లాడుతూ భారత్ మాతాకీ జై లేదా వందేమాతరం అని కూడా అనలేని, విగ్రహారాధనకు వ్యతిరేకమైన ముస్లింలు హిందువులకు మారుపేర్లు లేదా హిందూ దేవుళ్ల పేరుతో మారు పేర్లను ఉపయోగిస్తున్నారని చాలా ప్రాంతాల నుంచి తమకు సమాచారం అందిందని బజరంగ్ బాగ్రా అన్నారు. దేవతల పేర్లతో లేదా హిందూ విశ్వాస కేంద్రాల పేరుతో ప్రసాదం, పూజ సామాగ్రిని విక్రయిస్తున్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కూరగాయలు, ఇతర ఆహార పానీయాలను ముందుగా ఉమ్మివేసి అపవిత్రం చేసి ఆ తర్వాత హిందూ భక్తులకు విక్రయించే ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా అనేకం వెలుగులోకి వస్తున్నాయని తెలిపింది.

దేశంలోని అనేక తీర్థయాత్ర కేంద్రాల్లో ముస్లిం మతానికి చెందిన వారు నైవేద్యాలు, అలంకారాలు, దేవుడి నైవేద్యాలకు సంబంధించిన అనేక వస్తువులను అపవిత్రం చేసి విక్రయిస్తున్నారని, హిందూ విశ్వాసాలను అవహేళన చేస్తున్నారని, వీటిని తక్షణమే నిలిపివేయాలన్నారు.

హిందూ దేవాలయాలు, ధార్మిక స్థలాల పవిత్రతను కాపాడేందుకు, మతపరమైన మోసగాళ్లపై తక్షణమే సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. అదే సమయంలో, అటువంటి ద్రోహుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, వారిని బహిర్గతం చేసి, స్థానిక ప్రభుత్వ అధికారులకు తెలపాలని హిందూ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నామని వీహెచ్పీ కోరింది.