News

ఘనంగా ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం

111views

గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మంగళవారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆవిర్భావ దినోత్స వాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం ఏర్పాటు చేసిన 2కిలోమీటర్ల మారథాన్ ను మూడు జిల్లాల ఏబీవీపీ బాధ్యులు శివకుమార్, తలసేమియా బాధితుల కోసం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని డాక్టర్ కన్నెగంటి నాగేశ్వ రరావు, కంటి పరీక్షలను ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రారంభించారు. రక్తదానం చేసిన వారికి ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ సంధ్యా కోల్ సర్టిఫికెట్లు అందజేశారు.

ప్రతి ఒక్కరు దేశభక్తిని పెంపొందించుకోవాలని, రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్ కార్యకర్త, హిందూ చైతన్య వేదిక ప్రతినిధి మారుతీ వరప్రసాద్ కోరారు. ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెనాలిలోని స్థానిక శ్రీవైష్ణవి జూనియర్ కళాశాలలో మంగళవారం నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్, ఏబీవీపీ నగర గౌరవ అధ్య క్షుడు శ్రీనివాసరావు, హర్షిత, లోకేష్చంద్ర తదితరులు పాల్గొన్నారు.