135
పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం రైల్వే శాఖ ప్రత్యేక రైలు నడపనుంది. ఈ నెల 31న ప్రారంభమయ్యే రైల్లో ప్రయాణించి నాభిగయ, శిరో గయ, పూరీ జగన్నాథుడు, కాశీ విశ్వనాథ్, అన్నపూ ర్ణదేవి దర్శనం, గయలో శ్రావణ మాస పిండ తర్పణం, అయో ధ్యలో శ్రీరాముని దర్శనం, త్రివేణి సంగమంలో పుణ్య స్నానం, పురుహూతికదేవి, విమలదేవి, మంగళగౌరి, కాశీ విశాలాక్షి, అలోపిదేవి శక్తిపీఠా లను సందర్శించవచ్చు. 10 రోజుల ఈ యాత్రలో రవాణా, వసతి, అల్పాహారం, భోజనం కలిపి టికెటు ధర ఒక్కొక్కరికీ స్లీపర్ తరగతిలో రూ.19,500, థర్డ్ ఏసీలో 5. 32,500 ఉంటుంది. బుకింగ్ కోసం ఫోన్ నంబరు 9355021516లో సంప్ర దించవచ్చని రైల్వే అధికారులు తెలిపారు.