News

తవ్వకాల్లో బయటపడ్డ క్రీ.శ. 1070 నాటి పురాతన శివుని ఆలయం

55views

మహారాష్ట్రంలోని నాందేడ్ జిల్లాలో పురాతన శివుడి ఆలయం బయటపడింది. జిల్లాలోని హొట్టల్ గ్రామంలో జరిపిన తవ్వకాల్లో శివుడి ఆలయానికి సంబంధించిన ఆనవాళ్లను పరిశోధకులు కనుగొన్నారు.

చాళుక్యుల కాలం నాటి దేవాలయాలకు ప్రసిద్ధి చెందిన హొట్టల్ గ్రామంలో పూర్తి ఆలయంతో పాటు మూడు రాతి శాసనాలు లభించినట్టు అధికారులు తెలిపారు. శాసనాలపై క్రీ.శ. 1070 ప్రాంతంలో ఆలయ నిర్మాణం కోసం విరాళాలు ఇచ్చిన దాతల వివరాలు చెక్కబడింది. చరిత్రలో కళ్యాణి చాళుక్యుల రాజధానిగా ఉన్న హొట్టల్ ప్రాంతం అద్భుతమైన శిల్పాలకు, ఆలయాలకు కేంద్రంగా ప్రసిద్ధి చెందింది.

ఈ చారిత్రాత్మక దేవాలయాల్లో పునరుద్ధరణ కింద శిధిలాలను తొలగిస్తున్నప్పుడు పురావస్తు శాఖ అధికారుల బృందం ఆలయ స్థావరాన్ని గుర్తించారు. ఆలయం ఉన్నట్టు నిర్ధారించేందుకు అధికారులు నాలుగు కందకాలను తవ్వారు. శివలింగంతో కూడిన ఆలయాన్ని వెలికితీశామని రాష్ట్ర పురావస్తు శాఖ నాందేడ్ డివిజన్ ఇన్‌ఛార్జ్ అమోల్ గోటె చెప్పారు. చరిత్రకు సంబంధించిన వివరాల ప్రకారం..

కళ్యాణి చాళుక్యులను పశ్చిమ చాళుక్యులు అని కూడా అంటారు. తైలప-2 అనే రాష్ట్రకూట సామంతరాజు కళ్యాణి రాజ్యాన్ని స్థాపించినట్టు చరిత్ర చెబుతోంది. 200 ఏళ్లకు పైగా వీరి పాలన జరిగింది. వారి నుంచి కాకతీయులు వరంగల్ కేంద్రంగా పాలనను సాగించారు.