News

అయోధ్యలోనూ టీటీడీ తరహా పరిపాలనా విధానాలు

80views

అయోధ్యలోనూ టీటీడీ తరహా పరిపాలనా విధానాలు, భక్తుల రద్దీ నియంత్రణ పద్ధతులు అమలుచేసేందుకు చర్యలు చేపట్టామని అయోధ్య రామమందిర తీర్థక్షేత్ర బ్రస్టు సభ్యుడు దినేశ్ రామచంద్ర తెలిపారు సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆయన తమ బృందంతో కలిసి శ్రీవారి మూలమూర్తిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ… టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి అయోధ్యలో ఇప్పటికే పర్యటించారని, టీటీడీ పరిపాలనా విధానాలపై పవర్పాయింట్ ప్రదర్శన ఇచ్చారని తెలిపారు. ఈ నేపథ్యంలో శ్రీవారి భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను ప్రత్యక్షంగా పరిశీలించామని చెప్పారు. టీటీడీ అమలు చేస్తున్న దర్శనం, వసతి, అన్నప్రసాదాల వితరణ వంటి కార్యక్రమాలను ఆయోధ్యలోనూ అనుసరించేందుకు చర్యలు చేపట్టామని వివరించారు. ప్రస్తుతం అయోధ్యలో రోజూ లక్ష నుంచి లక్షన్నర మంది భక్తులు శ్రీరాముడిని దర్శించుకుంటున్నారని, రద్దీకి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.