ArticlesNews

జాతీయ విప్లవ జ్యోతి వీర్ సావర్కర్

104views

( మే 28 – వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ జయంతి )

వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ ఈ పేరు వినగానే భారతీయులందరి మదిలో దేశభక్తి ఉప్పొంగుతుంది. ఎందరో యోధులకు స్పూర్తినిచ్చిన వీరుడు.కారాగార శిక్షలు పడి అండమాన్‌ జైలులో 27 ఏళ్లు దుర్భర జీవితం గడిపినా చలించని ధీరుడు వీర సావర్కర్‌. ఒక కవిగా, రచయితగా, వక్తగా, చరిత్ర కారునిగా, సంఘ సంస్కర్తగా హైందవ సమాజాన్ని జాగృత పరిచారు.

వీర్ సావర్కర్ 1883 మే 28న నాసిక్‌ జిల్లా భాగూరు గ్రామంలో దామోదర్‌ పంత్‌, రాధాబాయి దంపతులకు జన్మించారు.నాటి బ్రిటిష్‌ పాలనలో భారతీయులు పడుతున్న కష్టాలను చూసి సావర్కర్‌ సోదరులు దేశ స్వాతంత్య్రం కోసం తమ జీవితాన్ని సమర్పిస్తామని ప్రతిజ్ఞ చేశారు. తెల్లవారి గడ్డ లండన్‌ నుంచి విప్లవోద్యమం నడపాలనే కృత నిశ్చయంతో అక్కడికి వెళ్లారు.

సావర్కర్‌కు బ్రిటిష్‌ ప్రభుత్వం అండమాన్‌లో కారాగార శిక్ష విధించింది.జైలులో ఉన్న రోజుల్లో సావర్కర్‌ తన రచనా వ్యాసాంగాన్ని సాగించారు. సుధీర్ఘకాలం కారాగార జీవితం తర్వాత ఆలయంలోకి హరిజనులకు ప్రవేశం కల్పించారు వీర సావర్కర్‌. హిందూ సమాజం నుంచి కొన్ని వర్గాలను దూరం చేసుకోవడం అంటే మనకు శత్రువులను పెంచుకోవడమేనని గుర్తు చేసేవారు. అన్యమతం స్వీకరించిన వారిని శుద్ధి ఉద్యమాల ద్వారా తిరిగి హిందూ సమాజంలోకి తీసుకొచ్చే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

దేశం కోసం జీవితాన్ని అర్పితం చేసిన ఆ మహానీయునికి దక్కాల్సిన గౌరవాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇవ్వలేదు. జీవిత చివరి దశలో తన 86వ ఏట జీవితాన్ని త్యజించారు సావర్కర్‌. 1966 ఫిబ్రవరి 26న ఈ లోకం నుంచి విముక్తి పొందారు. ఆ మహనీయుడు అందించిన స్ఫూర్తి కోట్లాది మంది భారతీయుల్లో అగ్నికణమై చిరస్థాయిగా నిలిచిపోతుంది.