ArticlesNews

బ్రాహ్మీముహూర్తం అంటే ఏమిటి?

85views

ల్లవారుజామున 3 గంటల 20 నిమిషాల నుంచి 5 గంటల 40 నిమిషాల మధ్యకాలాన్ని బ్రాహ్మీముహూర్తం అంటారు. మనిషికి జ్ఞానాన్ని అందించే అద్భుతకాలం బ్రాహ్మీముహూర్తం. సాధారణంగా ప్రతిగంటకు గ్రహహోర మారుతుంది. అంటే క్షితిజ రేఖ దగ్గర ఆ గ్రహం కనిపిస్తుందని అర్థం. హోరాకాలానికి అధిదేవత అయిన గ్రహం

మనం చేసే పనులను నిర్దేశిస్తుందని జ్యోతిషం చెబుతున్నది. తెల్లవారుజామున బ్రాహ్మీముహూర్తంపై ఏ గ్రహాల ప్రభావమూ ఉండదు.

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు సైతం అతీతమైన సర్వ చైతన్యమయమైన అమ్మవారి శక్తిమాత్రమే ఈ కాలంలో ప్రభావవంతంగా ఉంటుంది. ఆ శక్తికి రూపగుణాలు ఉండవు. అది శుద్ధ చైతన్యం. కేవలం జ్ఞాన స్వరూపం. అందుకే తెల్లవారుజామున నేర్చుకున్న విద్య హృదయానికి హత్తుకుంటుంది. బాగా జ్ఞాపకం ఉంటుంది. ఏకాగ్రత కుదురుతుంది. వాక్‌శుద్ధి కలుగుతుంది. అందుకే, చదువుకు, జపసాధనలకు బ్రాహ్మీముహూర్తాన్ని మించింది లేదని పెద్దలు చెబుతుంటారు.