News

సైలెంట్‌గా నక్షత్రాలు అదృశ్యం

74views

గత కొన్నేళ్ళుగా రోదసిలో వందలాది పెద్ద నక్షత్రాలు హఠాత్తుగా కనిపించకుండా పోవడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనిపై పరిశోధనలు చేయగా.. అవి అంతర్ధానమైనట్టు గమనించారు. సాధారణంగా ఓ పెద్ద నక్షత్రం సూపర్‌నోవా స్థితికి చేరుకోగానే భారీ పేలుడు సంభవిస్తుంది. అయితే, ఈ నక్షత్రాల విషయంలో అది జరుగలేదు. సైలెంట్‌గా నక్షత్రాలు అదృశ్యమయ్యాయని జర్మనీ పరిశోధకులు వెల్లడించారు.