News

భార‌త వ్యోమ‌గాముల‌కు శిక్ష‌ణ ఇవ్వ‌నున్న నాసా

96views

భార‌తీయ వ్యోమ‌గాముల‌కు అమెరికాకు చెందిన నాసా శిక్ష‌ణ ఇవ్వ‌నున్న‌ది. అంత‌ర్జాతీయ స్పేస్ స్టేష‌న్‌కు వ్యోమ‌గాముల‌ను పంపే ఉద్దేశంతో ఆ శిక్ష‌ణ ఉండ‌నున్న‌ట్లు భార‌త్‌లోని అమెరికా రాయ‌బారి ఎరిక్ గార్సెటి తెలిపారు. అమెరికా, ఇండియా మ‌ధ్య క‌మ‌ర్షియ‌ల్ స్పేస్ కాన్ఫ‌రెన్స్ అన్న అంశంపై బెంగుళూరులో జ‌రిగిన స‌ద‌స్సులో ఆయ‌న మాట్లాడారు. అమెరికా, భార‌త్ బిజినెస్ కౌన్సిల్ ఈ స‌మావేశాన్ని నిర్వ‌హించింది. ఈ ఏడాది లేదా ఆ త‌ర్వాత అయినా భార‌తీయ వ్యోమ‌గాముల‌కు నాసా అడ్వాన్స్‌డ్ శిక్ష‌ణ ఉంటుంద‌ని గార్సెటి తెలిపారు. త్వ‌ర‌లోనే స‌తీష్ ధావ‌న్ సెంట‌ర్ నుంచి నిసార్ శాటిలైట్‌ను ప్ర‌యోగించ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. స‌హ‌జ‌వ‌న‌రులు, ప‌ర్యావ‌ర‌ణం, భూ ఉప‌రిత‌లం, స‌హ‌జ విప‌త్తులు, స‌ముద్ర మ‌ట్టాలు, క్ర‌యోస్పియ‌ర్‌ను ప‌ర్య‌వేక్షించే ఉద్దేశంతో నిసార్‌ను ప్ర‌యోగించ‌నున్నారు. నాసా, ఇస్రో సంయుక్తంగా నిసార్ శాటిలైట్‌ను ప‌రీక్షించ‌నున్నారు.