ArticlesNews

ఆవు – పర్యావరణం

264views

దేశీయ ఆవు మూత్రం, పేడ మురికి ఏమాత్రం కావు. అవి మురికిని శుద్ధిచేసే శక్తి కలిగినవి. అవి పర్యావరణాన్ని కలుషితం చేయవు. కాలుష్యాన్ని నివారిస్తాయి. చెత్త, వ్యర్ధ పదార్ధాలు, ఆకులు మొదలైన కుప్పలపై పేడ, గోముత్రాలను జల్లితే ఈగలు, దోమలు రాకుండా ఉంటాయి. వాటి ఉత్పత్తి ఆగిపోతుంది. పైగా ఆ చెత్తే సేంద్రీయ ఎరువుగా మారి పంటలకు ఉపయోగపడుతుంది. ఇలాంటి ఎరువులో 1 శాతం, గోబర్‌ ‌గ్యాస్‌ ‌ప్లాంట్‌ ‌నుంచి వచ్చే వ్యర్ధం ద్వారా తయారైన ఎరువులో 2శాతం నైట్రోజన్‌ ఉం‌టుంది.

మహానగరాల్లో కాంక్రీట్‌, ‌సిమెంట్‌ ‌వంటి వాటితో కాలనీలు కడుతున్నారు. ప్రతి ఇంట్లో కనీసం ఒక వాహనం ఉంటోంది. అయితే వీటి వల్ల కలిగే కాలుష్యాన్ని నివారించే గోవును పెంచుకోవడానికి మాత్రం ఎవరు ముందుకు రావడం లేదు. ఆవు పేడ నీలలోహిత కిరణాలను నిర్వీర్యం చేస్తుంది. అలా ఈ కిరణాల వల్ల వచ్చే చర్మవ్యాధులు, మొదలైనవాటిని నివారిస్తుంది.

ఈ రోజుల్లో ఆవును పెంచడం ఎలా సాధ్య పడుతుందని ప్రశ్నిస్తుంటారు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవికాబట్టి అది సాధ్యపడిందని వాదిస్తుంటారు. ఏదైనా పని మనకు మేలు చేస్తుందనుకున్నప్పుడు దానిని ఒక్కరమే చేయలేకపోతే నాలుగురిని కలుపుకుని చేయాలి. నాలుగు కుటుంబాలు కలిసి ఆవులను పెంచుకో వచ్చును. వాటి ద్వారా వచ్చే పాలు, పెరుగు, వెన్నలను చక్కగా వాడుకోవచ్చును.

సేంద్రీయ ఎరువు వల్ల పంటలు బాగా పండుతాయి. విషరహితమైన, రుచికరమైన పదార్ధాలు లభిస్తాయి. పేడను పిడకలుగా చేసి ఉపయోగించడంవల్ల వంటచెరకు కోసం చెట్లు నరికే అవసరం తగ్గుతుంది. తద్వారా అటవీ సంరక్షణ సాధ్యపడుతుంది.