News

బాల రామయ్యకు అరుదైన కానుక

112views

కోట్లాది హిందువుల కల తీరి అయోధ్యలో బాల రామయ్య కొలువుదీరాడు. రామయ్యకు అత్తారిల్లు అయిన నేపాల్ సహా దేశ విదేశాల నుంచి భక్తులు భూరి విరాళాలు సమర్పిస్తూనే ఉన్నారు. తాజాగా రాంలాలా పట్ల తమకున్న భక్తితో బాల రామయ్య కోసం కొంతమంది భక్తులు కలిసి వెండి విల్లు, బాణాన్ని తయారు చేయించారు. ఇవి బాల రామయ్య చేతిలో అలంకరించేందుకు త్వరలో అయోధ్యకు చేరుకోనున్నాయి.

అయోధ్య శ్రీరాముడికి బెంగళూరుకు చెందిన కొంతమంది భక్తులు వెండితో విల్లు బాణాలు సమర్పించారు. అత్యంత అందమైన, మంత్రముగ్ధులను చేసే విధంగా ఉన్న వెండి విల్లు, బాణాన్ని ఈ రోజు శృంగేరి పీఠానికి చేరుకున్నాయి. ఇక్కడ స్వామీజీ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఆపై అయోధ్యకు పంపబడుతుంది.జనవరి 22న జరిగిన అయోధ్యలో రాముని పట్టాభిషేకం రోజున శృంగేరిలోని ఋత్విజులు, పూజారులు అయోధ్యలో జరిగిన మతపరమైన కార్యక్రమాలు, ఆచారాలలో పాల్గొన్నారు. అంతే కాదు అయోధ్య రాముని జలాభిషేకం కోసం శృంగేరి శారదాంభే కొలువుదీరిన తుంగా నది నుంచి నీటిని తీసుకుని వెళ్లారు.

చాలా అందమైన, మనోహరమైన వెండి విల్లు, బాణం శృంగేరి వారిచే ఆశీర్వదించబడింది. తర్వాత అయోధ్యకు పంపుతారు. శృంగేరి సీనియర్ శ్రీ భారతీ తీర్థ మహాస్వామీజీ పూజలు నిర్వహించగా జూనియర్ గురువు మిధుశేఖర శ్రీ చేతితో వెండి బాణంకు పూజాదికార్యక్రమాలను నిర్వహించారు.