News

భారత సంతతి శాస్త్రవేత్తకు ప్రతిష్ఠాత్మక అవార్డు

94views

ఖగోళశాస్త్రంలో ప్రతిష్ఠాత్మక ‘షా ప్రైజ్’ భారత సంతతి శాస్త్రవేత్తను వరించింది. గామా కిరణాల పేలుళ్లు, సూపర్నోవా, అంతరిక్ష వస్తువుల పరిశీలన తది తర అంశాల్లో కనుగొన్న విషయాలకుగానూ అమెరికాకు చెందిన ఆస్ట్రానమీ ప్రొఫెసర్ శ్రీనివాస్ ఆర్.కులకర్ణికి ఈ అవార్డు లభించిందని షా ప్రైజ్ ఫౌండేషన్ ప్రకటించింది. కులకర్ణి కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రొఫెసర్. ఆయనతో పాటు మెడిసిన్, లైఫ్ట్సైన్స్ విభా గంలో స్వీ లే థీయెన్, స్టువర్ట్ ఆర్కిన్ సంయుక్తంగా ‘షా ప్రైజ్ను గెలుచుకున్నారు. గణితశాస్త్రంలో పీటర్ సార్నక్ ఈ అవార్డును దక్కించుకున్నారు. ఈ ముగ్గురూ అమెరి కాకు చెందినవారే. ఈ అవార్డు కింద ఒక్కొక్కరికి సుమారు రూ.10 కోట్లు (12 మిలియన్ డాలర్లు) బహు మతిగా అందనున్నాయి.