News

రోదసిలోకి తెలుగుతేజం

97views

తెలుగు తేజం గోపీచంద్‌ తోటకూర ఆదివారం దిగ్విజయంగా రోదసియాత్ర చేశారు. తద్వారా భారత తొలి అంతరిక్ష పర్యాటకుడిగా చరిత్ర సృష్టించారు. రాకేశ్‌ శర్మ తర్వాత రోదసియాత్ర చేసిన రెండో భారతీయుడిగా గుర్తింపు పొందారు. అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్‌ సంస్థ రూపొందించిన న్యూషెపర్డ్‌-25 (ఎన్‌ఎస్‌-25) వ్యోమనౌకలో గోపీచంద్‌ ఈ యాత్ర పూర్తిచేశారు.

న్యూషెపర్డ్‌ రాకెట్‌కు ఇది ఏడో మానవసహిత అంతరిక్షయాత్ర. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 9.36 గంటలకు పశ్చిమ టెక్సాస్‌లోని ప్రయోగ వేదిక నుంచి ఇది నింగిలోకి దూసుకెళ్లింది. దీని ఎగువ భాగంలోని క్యాప్సూల్‌లో ఆరుగురు యాత్రికులు ఆసీనులయ్యారు.

భారత తొలి స్పేస్‌ టూరిస్టుగా గుర్తింపు పొందారు. విజయవాడలో పుట్టిన గోపీచంద్‌ తోటకూర.. అట్లాంటా శివారులోని ‘ప్రిజర్వ్‌ లైఫ్‌’ సంస్థకు సహ-వ్యవస్థాపకుడిగా ఉన్నారు. గోపీచంద్‌ పైలట్‌గానూ శిక్షణ పొందారు.