129
రాయలసీమలో ప్రసిద్ధి చెందిన తిరుపతి గంగమ్మ జాతరలో భాగంగా రెండవరోజు బైరాగివేషంలో గంగమ్మకు మొక్కులు సమర్పించుకుంటున్నారు భక్తులు. ఒళ్ళంతా నామకొమ్మును పూసుకుని అక్కడక్కడా బొగ్గుతో బొట్లు పెట్టుకుని ఆలయానికి చేరుకుని మ్రొక్కులు సమర్పించుకుంటున్నారు. అలాగే సున్నపుకుండలను నెత్తిపై పెట్టుకుని ఆలయం చుట్టూ తిరుగుతూ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. నిన్న గంగమ్మ జాతరకు చాటింపు జరిగిన తరువాత ఈరోజు నుంచి వేషధారణలు ప్రారంభమయ్యాయి. మరో 8రోజుల పాటు జాతర జరుగనుంది. వేషధారణలు ధరించిన భక్తులు ఆకాశవాణితో ప్రత్యేకంగా మాట్లాడారు.