News

త్యాగరాజ కృతి వైభవాన్ని చాటిన కచేరీలు

207views

సద్గురు త్యాగరాజ స్వామి జయంతి సందర్భంగా సద్గురు సంగీత సభ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంగీతోత్సవాలు త్యాగరాజ స్వామి కృతి వైభవాన్ని చాటుతున్నాయి. సోమవారం నాటి కార్యక్రమంలో బి. హర్షిత త్యాగరాజ స్వామి రచించిన సంకీర్తనలు ఆలపించారు. యువ సంగీత కళాకారులు అంబ టిపూటి రామలక్ష్మి, సుబ్రహ్మణ్య మహతి, సంగీత సమితి, తాడేపల్లి శాంకరి, మల్లాది అనన్య, మల్లాది అభిజ్ఞ గాత్రంతోనూ.. పారుపల్లి ఇభానన్ మాండోలిన్, ప్రభానన్ వేణువుతో, ఏబీటీ సుందరి వీణతోనూ త్యాగరాజ స్వామి కృతులను ఆలపించారు. విఖ్యాత సంగీత విద్వాంసులు వేమూరి విశ్వనాథ్, పోపూరి గాయత్రి గౌరీనాథ్ మల్లాది సూరిబాబులు సంకీర్తనలను ఆలపించి తమ భక్తిని చాటుకున్నారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు బీవీఎస్ ప్రకాష్, ఉపాధ్యక్షుడు బి. హరి ప్రసాద్, కార్యదర్శి గౌరీనాథ్ పాల్గొన్నారు