
ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు డేవిడ్ వార్నర్, జై హనుమాన్ క్యాప్షన్ తో వీరాంజనేయస్వామి ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా హనుమంతుడి భారీ విగ్రహం తాలూకు ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.
వైజాగ్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య బుధవారం రాత్రి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం విశాఖకు వచ్చిన డేవిడ్ వార్నర్, నగరంలో పర్యటించారు. వైజాగ్ లోని హనుమంతవాక జంక్షన్‌లో కనిపించిన హనుమంతుడి విగ్రహాన్ని ఫొటో తీసి అభిమానలుతో పంచుకున్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. వార్నర్, హనుమ స్వామి ఫొటో షేర్ చేసిన అరగంటలోపే లక్షా 74 వేల మంది లైక్ కొట్టగా 5 వేల మంది కామెంట్ల రూపంలో స్పందించారు.
భారతదేశ ఆచార సంప్రదాయాలపై సోషల్ మీడియా వేదికగా వార్నర్ గతంలోనూ స్పందించారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా కూడా శుభాకాంక్షలు తెలిపారు.