News

65 గోవులను తరలిస్తున్న కంటెయినర్‌ సీజ్‌

91views

అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి జాతీయ రహదారిపై వేంపాడు టోల్‌ప్లాజా వద్ద అక్రమంగా గోవులను తరలిస్తున్న కంటెయినర్‌ను నక్కపల్లి పోలీసులు పట్టుకుని సీజ్‌ చేశారు. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు కంటెయినర్‌లో గోవులు తరలిస్తున్నారన్న సమాచారం మేరకు నర్సీపట్నం డీఎస్పీ మోహన్‌, సీఐ విజయ్‌కుమార్‌లు టోల్‌గేట్‌ వద్ద తనిఖీలు నిర్వహించారు. కంటెయినర్‌లారీలో 65 గోవులను తరలిస్తున్నట్లు గుర్తించి సీజ్‌ చేశారు. గోవులను గోపాలపట్నం గోశాలకు సురక్షితంగా తరలించే ఏర్పాట్లు చేసినట్లు సీఐ తెలిపారు.