News

తిరుమలలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

105views

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా ఈరోజు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించారు. ఏప్రిల్ 9వ తేది ఉగాది పర్వదినాన్ని పుర‌స్క‌రించుకుని కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించారు ఆలయ అర్చకులు. ఉదయం ఆలయశుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేశారు. సుగంధ ద్రవ్యాలతో కలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నేపథ్యంలో అష్టదళ పాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది.