
దేశం గురించి నిస్వార్థంగా ఆలోచించే పార్టీలకు మాత్రమే తాము మద్దతిస్తామని మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో తాము భాగం కాదని స్పష్టం చేశారు. భూస్వామ్య రాజకీయాలకు తాము దూరంగా ఉంటామని చెప్పుకొచ్చారు. మక్కల్ నీది మయ్యం ఏడో వార్షికోత్సవం సందర్భంగా చెన్నైలో విలేకరులతో మాట్లాడారు కమల్. ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకేతో పొత్తు పెట్టుకుని లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా అని విలేకరులు ప్రశ్నించగా- కమల్ ఈ మేరకు సమాధానం చెప్పారు. రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఇటీవల నటుడు విజయ్ చేసిన ప్రకటనను స్వాగతించారు.
“పార్టీల పేరుతో చేసే రాజకీయాలను విడిచిపెట్టే సమయం ఇది. దేశం కోసం ఆలోచించాలి. దేశం గురించి నిస్వార్థంగా ఆలోచించే ఎవరితోనైనా ఎంఎన్ఎం కలుస్తుంది. కానీ స్థానిక భూస్వామ్య రాజకీయాలకు మాత్రం దూరంగా ఉంటుంది. మేం ఇండియా కూటమిలో చేరలేదు. పొత్తులపై చర్చలు కొనసాగుతున్నాయి. ఏదైనా గుడ్ న్యూస్ ఉంటే మీ ద్వారా ప్రజలకు చెబుతా.”
– కమల్ హాసన్, మక్కల్ నీది మయ్యం అధినేత
#WATCH | Chennai, Tamil Nadu | Actor and Makkal Needhi Maiam chief Kamal Hassan says, "I have already told that this is the time when you have to blur party politics and think about the nation. Anybody who thinks selflessly about the nation, my Makkal Needhi Maiam will be a part… pic.twitter.com/B9XfBmRvck
— ANI (@ANI) February 21, 2024