News

Isro: గగన్‌యాన్‌..ఇస్రో కీలక అప్‌డేట్‌

152views

భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్‌ ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. అంతరిక్షంలోకి మనుషులను సురక్షితంగా తీసుకెళ్లడానికి అనువైన సీఈ20 క్రయోజనిక్‌ ఇంజిన్‌ను ఇస్రో సిద్ధం చేసింది. ఈ విషయమై ఇస్రో తన ఎక్స్‌(ట్విటర్‌) ఖాతాలో అప్‌డేట్‌ ఇచ్చింది. క్రయోజెనిక్‌ ఇంజిన్‌ తుది పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసినట్లు వెల్లడించింది. నింగిలోకి వ్యోమగాములను పంపేందుకు వినియోగించే ఎల్‌వీఎం3 లాంచ్‌ వెహికల్‌లో దీనిని వాడనున్నారు.


‘సీఈ20 క్రయోజనిక్‌ ఇంజిన్‌ గగన్‌యాన్‌లో మానవ ప్రయాణానికి అనువైనదిగా రుజువైంది. ఇది కఠిన పరీక్షలను ఎదుర్కొంది. ఇక మానవ రహిత యాత్రకు వినియోగించే ఎల్‌వీఎం3 జీ1 లాంచ్‌ వెహికిల్‌లో వాడేందుకు పరీక్షలు పూర్తయ్యాయి’ఇస్రో అని పేర్కొంది. కాగా, గగన్‌యాన్‌ ప్రయోగంలో భాగంగా వ్యోమగాములను నింగిలో 400 కిలోమీటర్ల ఎత్తున్న కక్ష్యలోకి పంపి మళ్లీ వారిని సురక్షితంగా భూమిపైకి తీసుకురానున్నారు. ఈప్రయోగం ఇస్రో 2030లో చేపట్టనుం‍ది.