News

జ్ఞానవాపి మసీదు సెల్లార్లో పూజలు.. హైకోర్టు విచారణ 15కి వాయిదా

141views

వారణాసిలోని జ్ఞానవాపి మసీదు సెల్లార్లో పూజలు చేసుకునేందుకు హిందువులను అనుమతించేలా వారణాసి జిల్లా న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై తదుపరి విచారణను అలహాబాద్‌ హైకోర్టు ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. కాశీ విశ్వనాథుని ఆలయాన్ని ఆనుకుని ఉన్న మసీదు వ్యవహారాలను చూసే ‘అంజుమాన్‌ ఇంతెజామియా మసీదు కమిటీ’ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై జస్టిస్‌ రోహిత్‌రంజన్‌ అగర్వాల్‌ సోమవారం విచారణ జరిపారు. ఇరుపక్షాలు తమ వాదనలు వినిపించాయి. దావా వేసిన వ్యక్తికి వివాదాస్పద ఆస్తిపై ఎలాంటి హక్కు ఉందో ఇంకా నిర్ణయించాల్సి ఉందని, ఆ హక్కు తేలకుండానే పూజల్ని అనుమతించడం అక్రమమని ముస్లింల తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఆయన అభ్యర్థన మేరకు విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు.