News

అత్యధిక ఆన్‌లైన్‌ వ్యాయామ వీడియోలు.. గిన్నిస్‌ రికార్డుతో ఇస్రోకు అంకితం

151views

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విజయాలకు కృతజ్ఞత తెలియజేస్తూ బెంగళూరులో ఓ ప్రైవేట్‌ కంపెనీ వినూత్న కార్యక్రమానికి పిలుపునిచ్చింది. పాదాలు, మోచేతులు నేలకు ఆనిస్తూ (అబ్డోమినల్‌ ప్లాంక్‌ పొజిషన్‌) ఆదివారం చేపట్టిన వ్యాయామ విన్యాస వీడియోలు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌లో చోటు దక్కించుకున్నాయి.

ఇస్రో విజయాలకు గుర్తుగా బెంగళూరులోని శ్రీకంఠీరవ ఔట్‌డోర్‌ స్టేడియంలో సామూహిక వ్యాయామ విన్యాసం నిర్వహించారు. కాళ్లు..మోచేతులు నేలకు ఆనించి..చేపట్టిన ప్రత్యేక వ్యాయామ విన్యాసానికి సంబంధించి 5,194 వీడియోలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ అయ్యాయని సదరు ప్రైవేట్‌ కంపెనీ ప్రకటించింది.